టోక్యోలో ప్రస్తుతం జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో అద్భుతం జరిగింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- జిల్బర్మన్ ద్వయం విజయం సాధించింది. వీరిద్దరూ తల్లి కొడుకులు. తద్వారా పెద్ద వయసులో మ్యాచ్ విజయం సాధించిన మహిళగా స్వెత్లానా (64) రికార్డు సృష్టించింది. 16-21, 21-1, 21-11 తేడాతో దోహా-ఆడమ్ జోడీపై వారు గెలిచి, ప్రీక్వార్టర్స్‌లో అడుగు పెట్టారు.