ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరుణాకర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 01:28 PM

కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యను ఖండిస్తూ వెంటనే వైసీపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తుల మీద విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆదేశాల మేరకు రైల్వే కోడూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం సమర్పించారు. కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వైసీపీ మెడలు వంచి చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని రైల్వే కోడూరు మండలం టిడిపి అధ్యక్షుడు కొమ్మా శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ షాప్ డైరెక్టర్ జయచంద్ర, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్రతోటి సురేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మావిళ్ళ రామయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com