విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. నిలువరించుకోలేని కామవాంఛతో ఓ వృద్ధుడు ఆవుతో లైంగిక క్రీడ జరిపాడు. మానవత్వానికి మాయని మచ్చ ఇది. సభ్యసమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో కుక్క తో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు. కంచరాం గ్రామంకు చెందిన ఓ వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి మూగజీవాల పై లైంగిక దాడి చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. దీనిపై నిఘా వేసి వీడియోలు, ఫోటో లు స్థానిక ఓ వ్యక్తి తీసి బయటపెట్టాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
మా పిల్లల పరిస్థితి ఏంటి ఇలాంటి కామాందుడు గ్రామంలో ఉంటే మా పిల్లల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూగ జీవాలయితే సరిపోయిందని అదే మైనర్ బాలికలు, వృద్ధులు అయితే మా పరిస్థితి ఏమిటని మహిళలంతా ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.