బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. కానీ, బలపరీక్షకు ముందే స్పీకర్ పదవికి విజన్ సిన్హా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.