జి. సిగడాం: మండల కేంద్రమైన జి. సిగడాం పట్టుశాలి వీధికి చెందిన జల్లేపల్లి హరీష్ (22) కిడ్నీ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ ఐదునెలలుగా కిడ్నీ వ్యాధితో పడుతున్నాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు జల్లేపల్లి శ్రీనివాసరావు హేమలత దంపతులు విషాదం లో మునిగిపోయారు. విద్యార్థి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa