లావేరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులు నత్తనడకన సాగుతుండటంపై సమగ్ర శిక్షాభియాన్ ఏపీసీ ఆర్. జయప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లావేరు ఎంఈవో కార్యాలయాన్ని సందర్శించి నాడు నేడు పనులుపై ఎంఈఓ, సీఆర్పీ, ఎస్ఎస్ఎ ఏఈలతో సమీక్షించారు. 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనుల కోసం రూ. 135. 64 నిధులు మంజూరు చేస్తే ఇప్పటికి రూ. 48. 64 లక్షలు మాత్రమే ఖర్చు చేసి పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు తెరవని హెచ్ఎంలతో వెంటనే అకౌంట్లు తెరిచి లాగిన్ నమోదు చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంఈఓ ఎల్. ఈశ్వరరావు, ఏఈ జగదీశ్వరరావు, ఎంఐఎస్ మండల కోఆర్డినేటర్ జి. చంద్రశేఖర్, సీవో ఎస్. నాగరాజు, సీఆర్పీలు వి. గోవిందరావు, పి. మహేశ్వరం, జి. సూర్యనారాయణ పాల్గొన్నారు.