జి. సిగడాం: రైతులు పంటలను ఆన్లైన్మోదు చేసే ఈ-క్రాప్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయాధికారి వై. శారద సిబ్బందికి సూచించారు. మండలం ఎందువపేట ఆరీకేలో వ్యవసాయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిహారం, గిట్టుబాటు ధర పొందాలంటే ప్రతి రైతు పంటల వివరాలను ఈ-క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేయించాలని స్పష్టం చేశారు. అధిక దిగుబడులు, తెగుళ్ల నివారణకు రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ, సర్పంచ్ మామిడి శ్రీనివాసరావు, దేవిశెట్టి వెంకటేశ్వరావు, వ్యవసాయాధికారి శారద కనకం తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పతివాడ భవాని, అగ్రికల్చర్ అసిస్టెంట్లు అంపోలు అనూష, సంతోష్, హేమంత్, లక్ష్మీ నారాయణ, సుగుణాకరరావు పాల్గొన్నారు.