పులివెందులలోని నామాలగుండులో విషాదం చోటు చేసుకుంది. నీటిగుండంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి రాకపోవడంతో యువకుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాలను నీటిగుండం నుంచి బయటకు తీశారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన బాలశేఖర్, సంజీవ్‌కుమార్, గోపాలదాస్గా పోలీసులు గుర్తించారు.