కాకినాడ పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అక్బర్ ఆజాం ఈ ఏడాది జూన్ 23న మరణించాడు. కుమారుడి మరణానంతరం ఇటీవల తండ్రి హుస్సేన్ కోడలు ఫోన్లోని పాత వాట్సప్ ఛాటింగ్స్ గమనించారు. అందులో ఆజాం నివాసముండే అపార్ట్మెంట్లో పై ఫ్లాట్‌లో ఉంటున్న రాజేష్ జైన్‌తో పాటు మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్.. ఇద్దరు ప్రియులతో కలిసి కోడలు క్లోరోఫాం ఇచ్చి కొడుకును హత్య చేయించిందని తెలుసుకొని కంగుతిన్నాడు.