అనంతపురం జిల్లాలో ప్రియురాలు ఇంట్లో ప్రియుడు మృతి చెందాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సురేష్(23) పలమనేరులో కోళ్లఫారంలో పని చేసేవాడు. అక్కడ 50 ఏళ్ల వితంతువైన రామకుమారితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు గోరంట్ల మండలం చింతలపల్లిలోని రామకుమారి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారిద్దరూ సహజీవనం చేయసాగారు. ఇక శనివారం రాత్రి సురేష్ చనిపోయాడు. అతడి మృతికి ప్రియురాలే కారణమని సురేష్ తల్లిదండ్రులు కేసు పెట్టారు.