ద్వారపూడి - మండపేట రోడ్డు పూర్తిగా పాడయ్యిందని, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధర్నాకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీస్ లు టీడీపీ నాయకుల ముందస్తు అరెస్ట్ లు, గృహ నిర్భంధం చేసినట్లు టీడీపీ నాయకులూ తెలియజేసారు. ఐనప్పటికీ పోలీసులను దాటుకొని ధర్నాకు వెళ్ళడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్టులు చేసి వివిధ స్టేషన్లకు తరలించినారు అని తెలియజేసారు .