ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంని గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి తీసుకొనివెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలిసిందిగా కోరడం జరిగిందని టీడీపీ మహిళా రాష్ట్ర అద్యక్షురాలు వంగలపూడి అనిత తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇవే అంశాలను జాతీయ మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ గారి దృష్టికి, ఆరోగ్య మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గారి దృష్టికి, పలువురు ఎంపీల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందరూ మేము లేవనెత్తిన సమస్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందించారు అని తెలియజేసారు.