కృష్ణా జిల్లా అధికారులు , ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్ పిలుపునిచ్చారు . మంగళవారం పెడన లో గౌరవ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు . గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం గారు , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా గారు , జిల్లా ఎస్ . పీ . జాషువా గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల గారు తదితర జిల్లా అధికారులంతా హాజరయ్యారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పర్యటన కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఎలాంటి పొరపాటు తడబాటు లేకుండా నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు . ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గారు , ఆర్ . డీ . ఓ . లు , వివిధ శాఖల జిల్లా అధికారులు , ఎం . పి . డి . ఓ . లు , తహశీల్దార్లు పాల్గొన్నారు .