నరసాపురం మున్సిపాలిటీ 31వ వార్డులో గత కొన్ని రోజుల నుంచి మంచినీటి కుళాయి పైపులైను పగిలి డ్రైనేజీ నీరు కలిసి మంచినీటి కుళాయిల ద్వారా మురుగు నీరు వస్తున్నందున 31వ వార్డులోని ప్రజలు నరసాపురం మున్సిపాలిటీ వారికి, ప్రభుత్వం వారికి తెలియజేసి మొరపెట్టుకున్న స్పందించడం లేదు అని టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు అన్నారు. ఈరోజు వార్డు కౌన్సిలర్ పాలూరి బాబ్జి గారి ఆధ్వర్యంలో ఈ సమస్యపై నరసాపురం టీడీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ తెదేపా ఇంచార్జి పొత్తూరి రామరాజు గారు వార్డు లోని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పగిలిపోయిన మంచినీటి పైపులైనును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తక్షణమే మున్సిపాలిటీ వారు పైప్లైన్ బాగు చేయాలని, హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రజల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం వారి ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్థానిక ప్రజలు అధికారులకు, వైఎస్ఆర్సిపి నాయకులకు చెప్పిన పట్టించుకోరని ఎద్దేవా చేశారు. 10 రోజులలో ఈ సమస్యను పరిష్కరించకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు టెంటు వేసి నిరాహార దీక్ష చేసి పోరాడుతామని అన్నారు.