నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ అనే ఎస్సీ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే పొదలకూరు ఎస్సై కరీముల్లా కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలిచారు నారాయణ భార్య పద్మ , ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ కూడా చేపట్టింది. పద్మ పోరాటం జై భీం సినిమాలోని సినతల్లి పోరాటాన్ని తలపిస్తోందని ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన ఆదేశాల మేరకు పద్మకు అండగా నిలిచి ఆమె విజయానికి కారణమయ్యారు తెలుగుదేశం సీనియర్ నేత సోమి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.