శ్రీకాకుళం రూరల్ మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (సింగుపురం) ప్రాంగణంలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇక్కడి విద్యార్థినులతో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెరుగైన వసతుల కల్పనకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
విద్యార్థినులంతా ఇక్కడి వసతులు, పాఠశాల నిర్వహణ, అందిస్తున్న భోజన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. నాడు- నేడు ఫేజ్-2 లో భాగంగా మొత్తం 48 లక్షల రూపాయల అంచనా విలువతో పనులు చేపడుతున్నామని అన్నారు. నాడు-నేడు లో భాగంగా అనేక పాఠశాలల రూపురేఖలన్నీ మారిపోయాయని చెప్పారు. ఈ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మరో 90 రోజుల్లో పూర్తి చేసి, ఈ పాఠశాల నిర్వాహకులకు అందిస్తామన్నారు.
ఇక్కడి విద్యార్థినులు తమకు ఇంకో డార్మేటరీ కావాలని, ఇంకొన్ని అదనపు తరగతి గదులు కావాలని కోరారని, అందుకు తగిన విధంగా సంబంధిత అధికారులతోనూ, తల్లిదండ్రులతోనూ మాట్లాడి సంబంధిత పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయిమని చెప్పారు.