విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చారని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే మార్గమని సీఎం వైయస్ జగన్ నమ్మారని, ఆ దిశగానే అనేక అడుగులు వేశారన్నారు. విద్యారంగంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మాజీ మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు-నేడు అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారని చెప్పారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం వైయస్ జగన్‌కే సొంతమన్నారు.