ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు పాట్లు లేకుండా మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి నంద్యాల జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.