శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట: పోలాకి మండలంలోని ఉరజాం గ్రామానికి చెందిన గొల్లపల్లి చక్రవర్తి (45) కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ తట్టుకోలేక సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు హెచ్సీ రాంజీ తెలిపారు. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు చక్రవర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు కుమార్తె వివాహం చేయలేకపోతున్నానని బాధపడేవాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయ్యాడు.
ఆరోగ్యం మెరగవకపోవడంతో సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు శ్రీకాకుళం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోస్టుమార్ఖం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. చక్రవర్తికి భార్య, కుమార్తెలు ఉన్నారు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.