శ్రీకాకుళం జిల్లా: పలాస మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. మంత్రివర్యులు డాక్టర్ సీదిరి కి 9వ వార్డు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతీ కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలు ప్రతీ గడపకు వచ్చి వివరించారు.
ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామని, అతి త్వరలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేసి అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మీ వార్డులో ఉండే చెరువును ఆధునీకరణ చేసి మీకు ఇస్తానని తెలిపారు. కార్యక్రమంలో గుజ్జు జోగారావు, పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, పలాస మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, తాశీల్ధార్ మధుసూదనరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు బోర బుజ్జి, మీసాల సురేష్ బాబు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, మున్సిపల్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు మరియు వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.