ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్ర‌మ భూ దందా...విలేకరుల అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 08:59 PM

ఏపీలోని అనంత‌పురం జిల్లాలో ఓ భారీ అక్ర‌మ భూ దందా సంచలనం రేకిస్తోంది. ఈ దందాలో అంతా తామై వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు విలేక‌రుల‌తో పాటుగా ఓ డ్రైవ‌ర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని బుధ‌వారం స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఈ న‌లుగురికి న్యాయ‌మూర్తి రిమాండ్ విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియాల వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌ను పోస్ట్ చేసింది.


ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... అనంతపురంలో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని దాని య‌జ‌మానికి తెలియ‌కుండా మరొకరికి విక్రయించిన విలేక‌రులు భూమిని కొనుగోలుదారుడి పేరిట‌ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ కేసు విషయమై పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ మరియు సాక్షి విలేఖర్లే సూత్రధారులు అన్నవిషయం తేలిందని టీడీపీ ఆరోపించింది. ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే  రూ.75 లక్షలు చేతులు మారాయ‌ని కూడా ఆ పార్టీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa