అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా, ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లా, రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ప్రాంగణాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ఐసీపీ, అట్టారీ ద్వారా భారత్‌లోకి అక్రమంగా తరలించిన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఘటనతో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయి.ఈ కేసును అమృత్‌సర్‌లోని ఐసిపి అట్టారీలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు మొదట నమోదు చేయగా, ఎన్ఐఎ ఈ ఏడాది జూలై 30న కేసు నమోదు చేసింది.