నేతన్న నేస్తం పథకం అర్హులైన లబ్ధిదారులకు నాల్గవ విడత ఆర్థిక సహాయం రాష్ట్రవ్యాప్త పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ గురువారం ఉదయం పాల్గొననుండడంతో కలెక్టర్ పి . రంజిత్ బాషా ఏర్పాట్లను బుధవారం ఉదయం మరోమారు పరిశీలించారు.
పెడన తోటమూలలో ముఖ్యమంత్రిచే నిర్వహించే భారీ బహిరంగ సభ స్థలాన్ని, హుస్సేన్ పాలెం సమీపంలోని హెలిప్యాడు కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్నం నుంచి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలగారు బహిరంగ సభ జరిగే స్థలానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.