ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని అమ్మేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 12:11 PM

జగన్ రెడ్డి అబద్దాలను ప్రచార చేయడానికి సాక్షితో పాటు, టివి-9, Ntv లు ఒక్కటై వైసీపీ ప్రభుత్వ అనుకూల బులుగు మీడియాగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే అని టీడీపీ పార్టీ  ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇంకా ....  అయితే ఈ కలయిక అసత్య ప్రచారానికే పరిమితం కాలేదు. ఇప్పుడది అవినీతి బాగోతాలకు ఎదిగింది. దానికి నిదర్శనమే ఈ భూ అక్రమం అని ట్వీట్ చేసింది. 


అలానే అనంతపురంలో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని మరొకరికి  విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసారు. ఈ కేసు విషయమై పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక Ntv మరియు సాక్షి విలేఖర్లే సూత్రధారులు అన్నవిషయం తేలింది. 


ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే  రూ.75 లక్షలు చేతులు మారింది. సీసీ ఫుటేజ్, నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు విలేకరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అని తెలియజేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com