కాకినాడ జిల్లా పోలీసు అధికారులు మరియు మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS నిర్వహించారు. మహిళల సమస్యల పరిష్కారానికి రానున్న రోజులలో “Disha రిజిస్ట్రేషన్ Door to Door” కార్యక్రమం నిర్వహించాలని మహిళా పోలీసులకు సూచించిన SP.
అలానే “చేతన” కార్యక్రమం ద్వారా గ్రామాలలోని పాఠశాలలలో “గుడ్ టచ్ బ్యాడ్ టచ్” పై అవగాహన కల్పించాలి అని తెలియజేసారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసారు.