రోడ్డు ప్రమాదాల నియంత్రణ దృష్ట్యా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించి పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చిన అన్నమయ్య జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్. రోడ్డు భద్రతా నియమాలు పాటించని ఉల్లంఘనదారులపై పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహన దారులు అందరూ ప్రభుత్వ పద్ధతులని అలానే ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించకుండా , పాటించాలని తెలియజేసారు. దీని వలన వారికే కాకుండా తోటి ప్రయాణికులకు కూడా మేలు చేసిన వారు అవుతారు అని తెలియజేసారు.