వైసీపీ నేతలు అక్రమాలు చేస్తారు. వాటిని అందరూ చూస్తూ ఊరుకోవాలి. ఆపడానికి ప్రయత్నిస్తే ఇదిగో ఇలాగే దాడి చేస్తారు అని టీడీపీ పార్టీ ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసారు. వివరాల్లోకి వెళ్ళితే... పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం, పెద్ద గొల్లలపాలెం పంచాయతీలో వైసీపీ నేత అదీప్ రాజు అనుచరులు గడ్డ వాగు ఆక్రమించి ఇల్లు కడుతున్నారు.
గడ్డవాగు ఆక్రమణపై రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారన్న కోపంతో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై అదీప్ రాజు రౌడీ అనుచరులు ఎలా దాడికి దిగారో చూడండి. దాడిని ఖండించిన తెలుగుదేశం నేత బండారు అప్పలనాయుడు వైసీపీ రౌడీలపై చట్టపరమైన పోరాటానికి సిద్దమయ్యారు అని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.