బటన్ నొక్కుడు పేరుతో నేతన్నల గొంతు నొక్కుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ మాయం చేశారు అని టీడీపీ నాయకులూ అచ్చేమ్ నాయుడు అభిప్రాయపడ్డారు.
నేతన్న నేస్తం ద్వారా సీఎం జగన్ చేనేత కుటుంబాలకి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పై అయన స్పందిస్తూ.... మా హయాంలో చేనేత కార్మికులకు ఇచ్చిన 30% రాయితీ ఎత్తేశారు. నిజమా? కాదా?మా హయాంలో వర్షాకాలంలో పని చేయలేని కుటుంబాలకు నెలకు 4,000 రూ. ల చొప్పున రెండు నెలలకు 8,000 రూ. లు ఇవ్వటం ఆపేశారు. నిజమా? కాదా? మా హయాంలో ఉన్న.. నేతన్నల కు బీమా, ఋణ ఉపశమనం లాంటివి అన్నీ ఆపేశారు. నిజమా? కాదా? మా హయాంలో మేము ప్రతి చేనేత కుటుంబానికీ ఇచ్చిన నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇవ్వట్లేదు. నిజమా? కాదా? ఇవి కాకుండా మా హయాంలో 1,07,000 చేనేత కుటుంబాలకు నెలకు 2,000 రూ.ల చొప్పున ఏడాదికి 24,000 రూ.ల పించన్ ఇచ్చేవారం.
ఇప్పుడు పై సంక్షేమ పథకాలు అన్నీ ఎత్తేసి.. కేవలం 80,000 మందికి ఏడాదికి 24,000 ఇస్తూ, మా హయాంలో ఉన్న లబ్దిదారులను దాదాపు 30,000 మందికి కోత కోసి.. నేతన్న నేస్తం అంటూ నిస్సిగ్గుగా బూటకపు ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియకపోవచ్చు కానీ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కోల్పోయిన నేతన్నలకు మాత్రం నీ మోసం ఖచ్చితంగా అర్థమవుతుంది అని తెలియజేసారు.