ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ కొంతమంది మహిళలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియో వైరల్ కాగా, దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నారని అనుమానించారు. దీంతో మారిన్ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ గా తేలింది. అయితే ప్రధాని అధికార నివాసంలో ఇద్దరు మహిళా నేతలు పొట్టి దుస్తుల్లో అభ్యంతరకర రీతిలో ఉన్న ఫొటోపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని క్షమాపణలు చెప్పారు.