దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 59,366 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 17,684 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.81 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ఉంది. 3 రోజుల వరుస నష్టాల నుంచి అమెరికా సూచీలు బుధవారం కోలుకోగా, ఆసియా-పసిఫిక్ సూచీలు గురువారం సానుకూలంగా ఉన్నాయి.