ఆగస్టు 24 ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50మంది వరకు మరణించి ఉండొచ్చని బుధవారం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు. రష్యా అనాగరిక చర్యలకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన కొద్దిరోజుల్లో దాడి జరగ్గా ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.