ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కానీ కేరళ పాతనంతిట్ట జిల్లాలోని ఓ ఇంట్లో బిన్నంగా ప్రవర్తించారు. ఇటీవల 95 ఏళ్ళ మరియమ్మ మరణించారు. దీంతో దేశ, విదేశాల్లో స్థిరపడిన 40 మంది కుటుంబసభ్యులు వచ్చి ఆమె శవపేటిక ముందు నవ్వుతూ ఫోటో దిగారు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆమె జీవితాంతం ఆనందంగా బతికిందని, అంతిమ వీడ్కోలులోనూ సంతోషంతో సాగనంపడంలో తప్పు లేదని కుటుంబసభ్యులు తెలిపారు.