చిత్తూరు జిల్లా కుప్పంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలను వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. కాసేపట్లో చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ నేతలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇప్పటికే అక్కడ షాపులన్నీ మూసివేశారు.