తమిళనాడు రాష్ట్రంలో 36 గంటల్లో 15 హత్యలు జరిగాయని, ఇదేనా శాంతిభద్రతల పర్యవేక్షణా అంటూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ముఖ్యమంత్రి ప్రకటనల మోజులో ఉండడంతో రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయన్నారు. సీఎం ఆధీనంలో పోలీసు శాఖ ఉందనే విషయం మరువరాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa