దళిత విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజస్థాన్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి బడిలో నిర్వహించిన టెస్టులో ఒక ప్రశ్నకు సమాధానం రాయలేదు. దీంతో కోపంతో అశోక్ మాలి అనే టీచర్ బాలుడిని విచక్షణా రహితంగా కొట్టాడు. గోడకు తలను బాదాడు. విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్ను అరెస్ట్ చేశారు.