హోం వర్క్ ఒత్తిడి భరించలే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెరళం అనే గ్రామంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సంజయ్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో రోజూ ఇచ్చే హోం వర్క్ వల్ల మానసికంగా ఇబ్బంది పడేవాడు. తనను వేరే స్కూల్‌కి మార్చమని చెప్పినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.