మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అన్న జగన్.. త్వరలో పోర్టు శంకుస్థాపనకు వస్తానని తెలిపారు.