కర్ణాటకలోని కార్వాన్ జిల్లాలో అరుదైన కొండ చిలువ ప్రత్యక్షమైంది. మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో సాధారణ కొండచిలువ కన్నా భిన్నంగా ఉన్న తెల్లని కొండ చిలువ కనిపించింది. మెలనిన్ లోపం కారణంగా పాము చర్మం తెల్లగా మారుతుందని.. దీన్ని ‘అల్బినో స్నేక్’గా పిలుస్తారని స్నేక్ క్యాచర్ పవన్ నాయక్ తెలిపారు. ఈ కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.