అప్పటి సిఎంగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విశాఖలో వృద్ధాశ్రమం కోసం 12. 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ జిఓ జారీ చేశారని ఇప్పుడు రూ. 250కోట్ల విలువైన ఆ భూమిని ఆక్రమించుకుని జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు విక్రయిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. బుధవారం నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే విశాఖలో ఒక్కరు కూడా మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. విశాఖలో ప్రైవేటు భూములను సైతం బలవంతంగా లాక్కుంటున్నారని అన్నారు.