పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీ పరిధి నడిమీవాడ గ్రామానికి చెందిన గిరిజనుడు తమర్భ. జగ్గంరాజు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు హుటాహుటిన 4 కిలోమీటర్ల మేర డోలిమోత సహాయంతో తీసుకొని వచ్చి అక్కడ నుండీ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. గిరిజనులు మాట్లాడుతూ. మన గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడమే ఈ దుస్థితి నెలకొందని వాపోయారు. ఐటీడీఏ అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa