విశాఖపట్నం జిల్లా, మాడుగుల: చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ వద్ద ఈనెల 24వ తేదీ అర్ధరాత్రి ఒక కారు ప్రమాదం గురై బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారు ఎవరిది? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అసలు ఏం జరిగింది? అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కారు రన్నింగ్ లో బోల్తా పడిందా? మరి ఏమైనా జరిగిందా? అనే విషయాలపై వివరాలు వెల్లడి కావలసి ఉంది. సమాచారం అందుకున్న చోడవరం ఎస్ఐ విభీషణరావు తమ సిబ్బందితో సంఘటన స్థలం చేరుకొని పరిస్థితి పరిశీలించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని అయినప్పటికీ తాము దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.