విశాఖపట్నం జిల్లా: మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా గురువారం 401 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా గురువారం ఉదయానికి 136. 05 కి చేరుకోవడంతోపాటు జలాశయం వద్ద 16 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో 124 క్యూసెక్కు నీరు జలాశయంలోకి చేరింది. ఈ నేపథ్యంలో 281 క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా, 60 క్యూసెక్కులు రాచకట్టు , మరో 60 క్యూసెక్కులు ఆర్ఎంసి ద్వారా విడుదల చేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.