వంట నూనెల తయారు చేసే కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నూనెను ప్యాక్ చేసేటప్పుడు వంట నూనె పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని సూచించింది. ఆయా ఉష్ణోగ్రతల పేరిట కొన్ని కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఉద్దేశంతో ఈ నిర్ణం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఆయా కంపెనీలు లేబులింగ్ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa