భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన కేవీ సుబ్రహ్మణియన్ను కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక పదవిలో నియమించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుబ్రహ్మణియన్ను నియామిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సుబ్రహ్మణియన్ మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనున్నారు.