ఏపీలోని విశాఖపట్నంలో అరుదైన విష సర్పం కనిపించింది. నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపాన పారిశ్రామిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి 'డాగ్ ఫేస్ సీ స్నేక్'ను స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ పట్టుకున్నారు. కుక్క మొహం పోలికతో ఉండే ఈ పాము అతి ప్రమాదకరమైందని, దీని విషానికి విరుగుడు అందించే ఔషధం కూడా దొరకదని కిరణ్ తెలిపారు. ఇలాంటి సర్పాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa