ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో ఏపీ విభజన చట్టం హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక సమస్యల పరిష్కారంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఏపీ ప్రతినిధి బృందంతో గురువారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన చర్చలు సాయంత్రం 6 గంటల వరకు సాగాయి. భేటీలో తమ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించిందని ఏపీ ప్రతినిధి బృందం తెలిపింది.