కేరళ త్రిస్సూర్ జిల్లాలో ఓ మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త గల్ఫ్‌లో ఉండటంతో 12 ఏళ్లుగా తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. అయితే తీవ్ర ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆమెలో దుర్బుద్ధి పుట్టింది. తల్లిదండ్రులను చంపితే వారి ఆస్తి తనకు వస్తుందని భావించింది. ఆస్తి కోసం తన కన్నతల్లికి టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపింది. అయితే ఆమె తండ్రి టీ రుచి తేడాగా ఉందని తాగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.