పాకిస్థాన్‌లో పోలియో కేసులు బయటపడ్డాయి. పంజాబ్, ఖైబర్ రాష్ట్రాల్లోని పెషావర్, బన్ను, లాహోర్ పట్టణాల్లో పిల్లలకు అంగవైకల్యం కలిగించే వైల్డ్ పోలియో వైరస్ కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొన్నేళ్లుగా మిలిటెంట్లు చేస్తున్న దుష్ప్రచారంతో కేసులు వచ్చాయని చెప్పారు. పోలియో చుక్కల వల్ల భవిష్యత్తులో పిల్లలకు వంధ్యత్వం కలుగుతుందన్న అపోహలు సృష్టించి ఆరోగ్య కార్యకర్తలు రాకుండా చేశారన్నారు.