ఏపీలోని స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ రేపు (నాలుగో శనివారం) సెలవు ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13న (రెండో శనివారం) అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు పనిచేశాయి. దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.