యూపీలోని మథుర జంక్షన్లో ఓ 7 నెలల చిన్నారి కిడ్నాప్ కు గురైంది. చిన్నారి తల్లి ఒడిలో నిద్రిస్తున్న సమయంలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేశాడు. కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. బాధిత దంపతులు కాస్గంజ్ ఎక్స్ప్రెస్లో చిన్నారితో కలిసి తెల్లవారుజామున మథుర జంక్షన్ కు చేరుకున్నారు. చీకటి ఎక్కువ ఉందని 7వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద నిద్రపోయారు. తల్లి ఒడిలో నిద్రస్తున్న చిన్నారి సంజయ్ ను గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకుని వెళ్లిపోయాడు.